జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడి గా ఎంపికైన నరసింహను ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జు శాలువాతో సన్మానం.
![]() |
నరసింహను సన్మానిస్తున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు . 0 |
కాసిపేట మండలం మలకపల్లి గిరిజన ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు నరసింహ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యాడు. ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయంలో ప్రాజెక్టు అధికారి కుసుపు గుప్తా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు శాలువాతో సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన అజ్మీర నరసింహను మండల ఉపాధ్యాయ సంఘ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మండల నాయకులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.